ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దేవతామూర్తులకు పూజలు చేశారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో రుద్రేశ్వర స్వామికి 200 మంది దంపతులతో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్రపఠ నంతో మహాన్నపూజ చేశారు. గణపురం మండలం కోటగుళ్లలోని నందీశ్వరుడు, గణపేశ్వరుడికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. వరంగల్ స్టేషన్రోడ్లోని ఆకారపు వారి గుడిలోని కాశీ విశ్వేశ్వరస్వామివారికి వేద మంత్రోచ్ఛారణలతో లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరుడికి 39 లీటర్లతో పాలాభిషేకం చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 5