హనుమకొండ స బర్బన్, అక్టోబర్ 10 : అల్పపీడనం ప్రభావంతో గురువారం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, ప్రస్తుతం జిల్లాలో లక్షా 50వేల ఎకరాల్లో వరి సాగు కాగా మరో 15-20 రోజుల్లో కోత దశలో ఉన్నాయి. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షం వల్ల పొలాలు నేలవాలాయి. మరికొద్ది రోజుల్లో వర్షాలు పడొచ్చని హెచ్చరికలుండడంతో వరి కోతల సమయంలో వర్షాలు పడితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
వ్యా పారులు గిట్టుబాటు ధర చెల్లించే అవకాశాలు ఉండవని ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు సన్నవడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్షాల వల్ల వరి గింజలు నా ణ్యత తగ్గొచ్చని రైతులు చెబుతున్నారు. వర్షం వల్ల బతుకమ్మ ఆడేందుకు పలుచోట్ల మహిళలు ఇబ్బంది పడ్డారు. పగలు ఎండ, ఓ వైపు వర్షం.. రాత్రి చలి ఉండడంతో భిన్నమైన వాతావరణం నెలకొంది.