Warangal | గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
వరంగల్ : పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సీపీఐ నల్లబెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లబెల్లి బస్టాండ్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ కు పూలదండలు వేసి, కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ.. అమెరికా- ఇజ్రాయిల్ ఉమ్మడిగా ఇరాన్ యుద్ధానికి సిద్ధమయ్యే సూచనలు ప్రపంచానికి తెలిసినప్పటికీ మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు అవసరమైన గ్యాస్ చమురు నిలువలను పెంచుకోవడానికి ఎలాంటి కృషి చేయకుండా యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు.
గ్యాస్ కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గృహ వ్యాపార గ్యాస్ సిలిండర్లను దొరకకుండా బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైనాల వీరస్వామి, మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్, మామిండ్ల అయిలయ్య, పిట్టల రామస్వామి, శ్రీహరి, బిట్ల సారంగం, సామల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

