భీమదేవరపల్లి, ఏప్రిల్ 25: వచ్చేనెల 5వ తేదీన భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో జరిగే సీపీఐ 8వ మండల మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి అదరి శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో జరిగే భూ పొరాటంలో పాల్గొన్న వారందరికీ, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్య క్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు మంచాల రమాదేవి, నాయకులు కొంగల రామచంద్రారెడ్డి, అదరి రమేష్, సన్నీల్ల రవి, మార్పు కృష్ణారెడ్డి, సుంచు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.