రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలి : సీపీ
రౌడీషీటర్లపై నిత్యం నిఘా పెట్టాలని పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత స్టేషన్ల అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలన్నారు.
సుబేదారి, ఆగస్టు 22 : రౌడీషీటర్లపై నిత్యం నిఘా పెట్టాలని పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత స్టేషన్ల అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. నేరం జరుగకముందే అలర్ట్‌గా ఉండి, నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, విక్రయదారులు సమాచారం తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా త్వరగా దర్యాప్తు చేసి, నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, కవిత, రాజమహేంద్రనాయక్, కిషన్ సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

