కాజీపేట, ఏప్రిల్ 25: కాజీపేట పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు అదృశ్యమైన కేసు గురువారం రాత్రి నమోదైంది. కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని జవహర్ కాలనీ చెందిన అయిత సందీప్ కుమార్ (44), అయిత మానస (40) ఇద్దరు భార్యాభర్తలు. ఈ నెల 21న ఉదయం ఇంటి నుంచి యాక్టివా బండిపై బయటి కెళ్లారు.
గురువారం రాత్రి వరకు వారు ఇంటికి చేరుకోక పోవడం, ఆచూకీ తెలియ రాలేదని తెలిపారు. కాగా, వారి స్కూటీ వడ్డేపల్లి చెరువు సమీపంలో పోలీసులకు లభ్యమైందన్నారు. అదృశ్యమైన సందీప్ కొడుకు తల్లిదండ్రులు కనిపించడం లేదని కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.