ఓ వైపు ధాన్యం.. మరోవైపు పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు పడుతున్నాడు. నర్సింహులపేట మండలం పడమటిగూడెం పత్తి మిల్లు వద్ద అసలు రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీసీఐ ద్వారా మద్దతు ధర వస్తుందని వెళ్తే దళారులతో కుమ్మకై తేమ పేరుతో తక్కువ ధర చెలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీసీఐ దిగుమతులు చేయకపోవడంతో రైతులు వాహనాలతో ఇలా బారులు తీరాల్సి వచ్చింది.
– నర్సింహులపేట, నవంబర్ 27