కరీమాబాద్, మే 18: కాంగ్రెస్ ప్రభుత్వంలో వేధింపుల పరంపర ప్రతిపక్ష నేతలతోనే ఆగడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ రౌడీ షీటర్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలపై పోలీసు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం పనిచేసి… ఆ తర్వాత మాజీ రౌడీ షీటర్ వ్యవహారాలను వ్యతిరేకిస్తున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‌ను మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. 66 ఏండ్ల గుండేటి నరేందర్‌పై అత్యాచార యత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త నమిండ్ల లావ ణ్య ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం కార్పొరేటర్ గుం డేటి నరేందర్‌ను మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిబ్బంది అరె స్టు చేశారు.
అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ నరేందర్ అరెస్టుతో వరంగల్ నగరంలో రోజంతా హైడ్రామా జరిగిం ది. కార్పొరేటర్ నరేందర్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కేసు వి వరాలను తెలుసుకునేందుకు 3 గంటలపాటు వేచి ఉన్నారు. విచారణ జరుపుతున్నామని, సహకరించాలని పోలీసులు వారికి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పోలీసు స్టేషన్‌కు వస్తుండడంతో కార్పొరేటర్ నరేందర్‌ను అ క్కడి నుంచి వరంగల్ ఏసీపీ ఆఫీస్‌కు తరలించారు. సాయం త్రం వరకు విచారించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. లావణ్య ఫిర్యాదు చేసిన క్షణాల్లోనే మిల్స్‌కాలనీ పోలీసులు నరేందర్‌ను అరెస్ట్ చేయడంపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు పద్మశాలీ కుల సంఘా లు మద్దతుగా నిలిచాయి. గ్రేటర్ వరంగల్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి.
కాంగ్రెస్ అంటేనే వర్గపోరు
కాంగ్రెస్ అంటేనే వర్గపోరు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నాయి. పార్టీలో వర్గ రాజకీయాలు సహజం. నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నా. వర్గ రాజకీయాలు నాకు కొత్తకాదు. ఎన్ని వర్గాలున్నా ఎన్నికల సమయంలో సమష్టిగా పనిచేయడం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకత. గుండేటి నరేందర్ నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి. మూడు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన నాయకుడు. అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడం బాధాకరం. పోలీసులపై విశ్వాసం ఉంది. విచారణలో నిజానిజాలు బయటికొస్తాయి. పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం మాది, సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కార్పొరేటర్ నరేందర్ అరెస్టుపై ఆలోచిస్తారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. తప్పు చేసిన వారి ని, సహకరించిన వారికి శిక్ష తప్పదు.
– బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ
తూర్పులో అసలు ఏం జరుగుతున్నది..
వరంగల్ తూర్పులో అసలు ఏం జరుగుతున్నది. నియోజకవర్గ పరిధిలో రోజురోజుకూ అట్రాసిటీ కేసులు పెరుగుతున్నాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‌పై సొంత పార్టీ మహిళా నేత ఫిర్యాదు చేయడం, వేధింపుల కేసు పెట్టడం వెనక మర్మమేంటి? ఏ పార్టీలో ఉన్నా గుండేటి నరేందర్ విలువలతో బతికిన వ్యక్తి. అభివృద్ధిని పక్కన పెట్టి మంత్రి సురేఖ సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలో భాగమే ఈ అట్రాసిటీ కేసులా?. కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‌పై పెట్టిన అట్రాసిటీ కేసులో నిజానిజాలను బయటపెట్టాలి. అంతేకాకుండా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలి.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
పార్టీ దృష్టికి తీసుకెళ్తాం..
కార్పొరేటర్ గుండేటి నరేందర్ అరెస్ట్ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం. జిల్లాలో ఎవరికి ఏ పదవులు ఇచ్చినా జిల్లా అధ్యక్షురాలి హోదాలో నాకు తెలుసు. కా ర్పొరేటర్పై ఫిర్యాదు చేసిన మహిళ తాను డివిజన్ మహిళా అధ్యక్షురాలినని చెప్పుకోవడంపై విచారణ చేస్తాం. కొంద రు మంత్రులమని, ఎమ్మెల్యేలమని సైతం చెప్పుకుంటున్నారు. కార్పొరేటర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన విషయాన్ని తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాం.
– ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు
తూర్పులో బతకలేకపోతున్నాం…
తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తలు బతకలేకపోతున్నాం. కొంతమంది పార్టీ నాయకుల నుంచి వేధింపులు ఎక్కువవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన మమ్ముల్ని కొందరు నాయకులు ఇబ్బందిపెడుతున్నా రు. కార్పొరేటర్ స్థాయి వ్యక్తిపైనే ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడితే ఇక సామాన్య కార్యకర్తలు, ప్రజల పరిస్థి తి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలాంటి నాయకులపై పార్టీ అధిష్ఠానంతోపాటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– పరమేశ్వర్, జిల్లా యూత్ అధ్యక్షుడు