హనుమకొండ చౌరస్తా, జూన్ 5 : 2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు. ఉదయం మొదటి సెషన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 115 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 28,931 విద్యార్థులకు 25,982 మంది హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 116 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 28,969 విద్యార్థులకు 26,298 మంది హాజరయ్యారని తెలిపారు. గురువారం ఉదయం సెషన్తో ప్రవేశ పరీక్ష పూర్తవుతుందని చెప్పారు. వరంగల్ రీజియన్లో వరంగల్, నర్సంపేటలోని 8 సెంటర్లలో మొదటి సెషన్లో 1,554 విద్యార్థులకు 1,446 హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్లో 1,554 విద్యార్థులకు 1462 మంది పరీక్ష రాశారని తెలిపారు.