హనుమకొండ చౌరస్తా, జూన్ 6 : టీజీ ఐసెట్ ప్రశాంతంగా జరిగినట్లు కన్వీనర్ నరసింహాచారి తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మూడో సెషన్లో 28,256 మంది విద్యార్థులకు 25,662 మంది హాజరయ్యారని, మొత్తం 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 116 రీజియన్ సెంటర్లలో 86,156 మంది విద్యార్థులకు 77,942 మంది(90.47 శాతం) హాజరైనట్లు పేరొన్నారు. వరంగల్, నర్సంపేటలో గురువారం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన మూడో సెషన్లో 1,545 మంది విద్యార్థులకు 1,456 మంది హాజరైనట్లు తెలిపారు. మొత్తం మూడు సెషన్లలో మొత్తం 4,659 మందికి 4364 మంది హాజరైనట్లు పేరొన్నారు. ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ జూన్ 8వ తేదీన విడుదల చేయనున్నట్లు, విద్యార్థులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 8, 9 తేదీల్లో https://icet.tsche.ac.in లో నమోదు చేయవచ్చని కన్వీనర్ నరసింహాచారి తెలిపారు.