ములుగురూరల్, మే 15 : కేఎఫ్ లైట్ బీర్లలో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న ములుగు మండలం మల్లంపల్లిలోని మహంకాళి వైన్స్‌లో అదే గ్రామానికి ఓ యువకుడు ఆరు బీర్లు కొనుగోలు చేశాడు. వాటిలో ఐదు బీర్లను ఓపెన్ చేయగా ఆల్కాహాల్‌కు బదులు నీళ్లున్నట్లు గుర్తించి ఖంగుతిన్నాడు. నాసిరకంగా ఉందని భావించి అదే బ్యాచ్ నంబర్ కలిగిన ఆరో బీర్ బాటిల్‌ను ఎక్సైజ్ అధికారులకు అందించి నాసిరకం బీర్ల విక్రయాలు జరుపుతున్నారని బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సదరు బీర్ బాటిల్‌ను నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామని, లోపం నిర్ధారణ అయితే సంబంధిత వైన్‌షాపు యాజమాన్యంతో పాటు బీరు తయారు చేసిన కంపెనీపై ఎక్సైజ్ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని యువకుడు తెలిపాడు.