వరంగల్ : పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. అయితే కొన్ని జిల్లాలో అనువైన స్థలాలు దొరకపోవడంతో నూతన కలెక్టరేట్ల నిర్మాణం కొంత ఆలస్యమైంది. అందులో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కూడా పెండింగ్లో ఉంది. తాజాగా వరంగల్ లోని అజాంజాహి మిల్ స్థలంలో 6.16 ఎకరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలోనే కలెక్టర్ కార్యాలయం భవన సముదాయం నిర్మాణం పనులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు జరుపుకున్నారు.