ఏటూరునాగారం/ మంగపేట, మే 24 : ఆరు గ్యారెంటీలు, 420 మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుతో బుద్ధిచెప్పాలని ఎమ్మెల్సీ ఎన్నికల ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఏటూరునాగారం మండలకేంద్రం, మంగపేట మండలం రాజుపేట, తిమ్మంపేట, కమలాపురం గ్రామాల్లో పట్టభద్రులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, జడ్పీ చైర్పర్సన్, నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి హాజరయ్యారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలు, పాలనను గాలికి వదిలి గాలి మోటర్‌పై ఢిల్లీకి చకర్లు కొడుతున్నట్లు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రతి పట్టభద్రుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సమస్యలపై ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను బరిలో నిలిపి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదన్నారు. ఈ సమావేశాల్లో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్‌కుమార్, కుడుముల లక్ష్మీనారాయణ, సుబ్బుల సమ్మయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పోరిక గోవిందనాయక్, పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖాజాపాషా, తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్, సప్పిడి రాంనర్సయ్య, చిన్ని కృష,్ణ తూరం పద్మ, తాటి కృష్ణ, మంగపేట పీఏసీఎస్ చైర్మన్ తోట రమేశ్, జిల్లా నాయకులు కాకలమర్రి ప్రదీప్‌రావు, తాటి కృష్ణయ్య, చిలకమర్రి లక్ష్మయ్య, చిలకమర్రి రాజేందర్, చిట్టిమల్ల సమ్మయ్య, యడ్లపల్లి నర్సింహారావు, కర్రి శ్యాంబాబు, మలికంటి శంకర్, భూక్యా జంపన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఎగ్గడి అర్జున్, చదలవాడ సాంబశివరావు, తుక్కాని శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్‌రావు, తిరుపతి, బాలకృష్ణ, కర్రి శ్రీను, రాయ సాహెబ్, మధు ప్రసాద్, మండల సోషల్ మీడియా ఇన్చార్జి, గుడివాడ శ్రీహరి, పూజారి సతీశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.