మహబూబాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ) : రూలు.. గీలు.. నై.. చెప్పింది చేయాల్సిందే.. లేదంటే మీకు బదిలీలు తప్పవని కాంగ్రెస్ నాయకులు అధికారులను బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. తాము చెప్పింది చేయకపోతే ఎమ్మెల్యేకు, మంత్రికి ఫిర్యాదు చేసామని, ఇకడ ఎలా పని చేస్తావో చూస్తాం అంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దికుతోచని స్థితిలో అధికార పార్టీ నాయకుల మాటలకు తలొగ్గక తప్పడం లేదనే వార్తలు వినవస్తున్నాయి. మాట వినని అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఈ మధ్య తీవ్రస్థాయికి చేరిందని ఉద్యోగుల్లో చర్చ కొనసాగుతున్నది.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి బదిలీల వరకు తాము చెప్పింది చేయాలని కాంగ్రెస్ నాయకులు అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీంతో జిల్లాస్థాయి అధికారి నుంచి మొదలుపెడితే గ్రామస్థాయి వరకు వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది. నరసింహుల పేట మండలంలో ఇటీవల కాలంలో ఓ రెవెన్యూ అధికా రి, పోలీసులు కలిసి కాంగ్రెస్ నాయకుడు ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నారు. వారికి వెంటనే మండల స్థాయి నాయకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘అది మా ట్రాక్టర్.. మా వాటిని పట్టుకుంటారా.. వెంటనే వదిలే యండి.. పోలీస్ స్టేషన్‌కు, ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకువెళ్లినా, అపరాధ రుసుము విధించి న బాగుండదు. వెంటనే వదిలేయండి’ అని హుకుం జారీ చేశాడు.
దీంతో బెంబేలెత్తిపోయిన అధికారులు చేసేదేమీ లేక వదిలిపెట్టారు. కురవి మండలం నల్లెల గ్రామ పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి డోర్నకల్‌లో ఓ ఫంక్షన్ వెళ్లగా అకడ కాపు కాసిన ఓ కాంగ్రెస్ నాయకుడు అతడిపై దాడి చేశాడు. బాధితుడు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తిరిగి అతడిపైనే కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇదెకడి న్యాయం అని పోలీస్ అధికారులను నిలదీస్తే అప్పుడు సదరు కాంగ్రెస్ నాయకుడి మీద కేసు నమోదు చేశారు.
హనుమకొండ, జూలై 25 : రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్‌లను సర్కారు నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాకు ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా కే శశాంకను ప్రభుత్వం నియమించింది.