బచ్చన్నపేట సెప్టెంబర్ 22 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్ గ్రామం కొత్తచెరువు వద్ద కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. గోదావరి జలాలతో చెరువు నింపడంతో మత్తడి ప్రారంభమైంది. ఈ క్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ మసూద్, గ్రామ శాఖ అధ్యక్షులు పాకాల కర్ణాకర్ ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాస్పల్లి రిజర్వాయర్ నుంచి అలింపూర్ గ్రామ చెరువులోకి గోదావరి జలాలు తెచ్చేందుకు, స్థానిక నేతలు ఎంతో కృషి చేశారని అన్నారు.
డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లోని చెరువుల నింపే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. అనంతపురం గ్రామ చెరువు ముత్తడి బచ్చన్నపేట గుడి చెరువులోకి, అది నిండగానే పోచన్నపేట చెరువులోకి గోదావరి జలాలు తరలిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జ్యోతి బైరయ్య, గూడ రవీందర్ రెడ్డి, జ్యోతి భాస్కర్, బందారం కుమార్, పరమేష్, నజీర్, బాలయ్య, రాములు, కుమారస్వామి, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.