నర్సంపేట రూరల్, ఆగస్టు 2 : కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం ఆకులతండా గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబా లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారిలో కేశబోయిన నాగరాజు, చిరంజీవి, సాంబరాజు, సందీప్, నరేశ్, సురేశ్‌కుమార్, రాజు, రాజ్‌కుమార్, రమేశ్, కుమారస్వామి, రాజశేఖర్, శ్రీకాంత్, చిన్నరాజు, యాదవరాజు, లంకాల రాజు, దామెర రమేశ్‌లతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, క్లస్టర్ ఇన్చార్జిలు మోతె పద్మనాభరెడ్డి, తాళ్లపెల్లి రాంప్రసాద్, ఆకులతండా బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు కిషన్, సమ్మాలు, శంకర్లింగం, మూడు సూక్య, కుమారస్వామి పాల్గొన్నారు.
చంద్రయ్యపల్లి నుంచి భారీగా చేరికలు
మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన 20 కుటుంబాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. గ్రామానికి చెందిన దర్గూరు ఎల్లస్వామి, కోడెపాక శంకర్, కుక్కమూడి ఎల్లయ్య, కుక్కమూడి స్వామి, కుక్కమూడి అంజి, బరిగెల రాంబాబు, కోడెపాక రాము, కోడెపాక గణేశ్, కోడెపాక శంకర్, కోడెపాక రాజు, కోడెపాక లక్ష్మణ్, బరిగెల దశరథం, సౌరపు సతీశ్, గురుకుంట్ల శ్రీకాంత్, జన్ను రమేశ్‌తో పాటు మరికొంత మంది పార్టీలో చేరగా ఎమ్మెల్యే పెద్ది వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సర్పంచ్ బరిగెల లావణ్య-కిశోర్‌కుమార్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పెద్ది తిరుపతిరెడ్డి, భాషబోయిన రాజు, గంపా రాజేశ్వర్‌గౌడ్, వీరన్న, స్వామి పాల్గొన్నారు.