కాటారం, మే 29 : ధాన్యం కాంటా కావడం లేదని రైతులు మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామంలో రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు ఓయడమే రైతులు చేసిన పాపమా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెంలోని శ్రీరుద్ర జిన్నింగ్ మిల్ గోదాములో మూడు రోజులుగా అన్లోడింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న లారీలు, గుమ్మళ్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. మంథని నియోజకవర్గంలో నెల రోజులుగా రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారని మధు తెలిపారు.
మరోవైపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల పక్షాన నిలబడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలవి రా జకీయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి కళ్లు తెరిపించడానికే ప్రత్యక్షంగా ఇక్కడకు వచ్చామనీ, పోచిరెడ్డి అనే రైతు తన వడ్లు 50 రోజుల తర్వాత కూడా కాంటా వేయకుండా కవ ర్లు కప్పి ఇక్కడే ఉంటున్నాడనీ, ఇది మంత్రికి సమస్యగా కనిపించడం లేదా అని పుట్ట మధుక ర్ ప్రశ్నించారు. కాటారం సబ్ డివిజన్ పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే తా ము జైలు భరో కార్యక్రమం చేపడుతామని మంథని మాజీ ఎమ్మెల్యే మధుకర్ హెచ్చరించారు.
మొదట మంథని నుంచి అనుకున్నామనీ, కానీ కాటారం నుంచే మొదలు త్వరలోనే కాటారం పోలీస్‌స్టేషన్‌కు బీఆర్ఎస్ నాయకులు అందరూ వస్తారనీ, అప్పుడు ఎంత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపుతారో చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, మాజీ మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్, సర్పంచ్‌లు పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వర్రావు, నాయకులు తోట జనార్ధన్, జక్కు శ్రావణ్, మానెం రాజబాబు, చీమల వంశీ, కొండగొర్ల వెంకటస్వామి, గాలి సడవలి, రవి, కుడుదుల రాజబాబు తదితరులు పాల్గొన్నారు.