MCPI(U) కేముద్రం : ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన మామీ మేరకు రూ.41వేల కోట్లతో రుణ మాఫీని అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతు ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ వివేక్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణాలను రైతులు చెల్లిస్తే రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిన పాలకు మాట మార్చి రుణ మాఫీ పూర్తి అయిందని అనడం బాధాకరమన్నారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, మహిళలకు, నెలకు రూ.25 వందలు జర్నలిస్టులకు, ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి అందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వీరస్వామి, రాజు, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.