కురవి, ఏప్రిల్ 9 : అమలు కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని పథకాల అమలులో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మండిపడ్డారు. 27న జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం బుధవారం కురవి మండలకేంద్రంలోని ఓం ఫంక్షన్హాల్లో నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ముందుగా అప్పులబాధతో కాకులబోడు తండా సర్పంచ్ భర్త గుగులోత్ కిషన్‌నాయక్ ఆత్మహత్య చేసుకోగా సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలలో ఎంపీ మాలోత్ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దికాలంలోనే ప్రజల వ్యతిరేకతను చూస్తున్నదని, సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కబ్జాలు, కమీషన్లతో కాంగ్రెస్ పాలన సాగుతున్నదని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి పది వేలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు తోట లాలయ్య, సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్, నూతకి సాంబశివరావు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బదావత్ రాజు నాయక్, నాయిని నరేశ్‌రెడ్డి, నెహ్రూనాయక్, బోడ శ్రీను, ఐలి నరహరిగౌడ్, అల్లూరి కిషోర్ వర్మ, కిన్నెర మల్లయ్య, బండి దీపక్‌గౌడ్, బానోత్ రమేశ్, రాము, గణేశ్, జకుల సందీప్, అయిలి వీరేందర్, చంద్రారెడ్డి, కృష్ణమూర్తి, రాంచంద్రయ్య, పాల్గొన్నారు.
కురవి మండల తులస్యతండా గ్రామ పరిధిలోని కీమ్యాతండాకు చెందిన బోడ బాజి తన పింఛన్ డబ్బుల నుంచి 1000 రూపాయలను బీఆర్ఎస్ రజతోత్సవ కోసం విరాళమిచ్చారు. ఈమేరకు మాజీ ఎంపీ కవిత మాలోత్‌కు నగదు అందజేశారు.