Yoga camp | హనుమకొండ, జూన్ 20:దేశంలో పుట్టిన యోగా విశ్వ వ్యాప్తం కావడంతో భారతీయులందరికీ గర్వకారణమని, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వరంగల్ జిల్లా కోర్టు సూపరింటెండెంట్ ఆకుతోట ఇందిరా, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బాలసముద్రంలోని చిల్డ్రన్ పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
యోగా మన ప్రాచీన సంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతి అన్నారు. యోగా మనసు, శరీరం, ఆలోచన, క్రియల ఐక్యతను సూచిస్తుందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని ఇది మీతో, ప్రపంచంతో, ప్రకృతితో ఏకత్వం అనే భావనను కనుగొనే మార్గం అని అన్నారు. ప్రతీ వ్యక్తిత్వాన్ని, వికాసానికి యోగా ఎంతో గొప్పగా సహాయపడుతుందని, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుందని అన్నారు. ప్రతీ మనిషి తన దైనందిన జీవితంలో యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలైనా బిపి, షుగర్, అల్సర్, అస్తమా వివిధ రకాల నొప్పుల నుండి విముక్తి కలుగుతుందని వారు. ప్రతీ వ్యక్తి యోగా పట్ల అవగాహనను పెంపొందించుకొని మానసికంగా, శారీరకంగా ఉన్నతగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ బత్తుల రాజేందర్, లకావత్ చిరంజీవి, సదానందం, శివ శంకర్, రవీందర్, నవీన్, శోభ, కళావతి, సుమ, భాస్కర్, సురేష్, శ్రీనివాస్, సాయిలు, వేంకటేశ్వర్లు, సునిత, గణేష్, మంజుల, విజయ, శ్యామల, రోజా, నయనా తదిరులు పాల్గొన్నారు.