వరంగల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో సుమారు రూ.60 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, గ్రామ పంచాయతీ ప్రహరీ గోడను ప్రారంభించారు.
అనంతరం గౌడ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసి మార్గం భిక్షపతి, సర్పంచ్ భాస్కర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.