మహదేవపూర్(కాళేశ్వరం), జనవరి 17 : కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం, మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ పుషరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధి పనులపై శుక్రవారం అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభాభిషేకానికి సుమారు 20 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పుషరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గోదావరి నదిలో ఇసుకపై తాతాలిక మట్టి రోడ్డు నిర్మించాలని, వీఐపీ ఘాట్ నుంచి పుషర ఘట్లను అనుసంధానం చేసేలా తాతాలిక రోడ్డు వేయాలన్నారు. తాతాలికంగా శానిటైజేషన్ వరర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అనంతరం తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు స్థలం, వీఐపీ ఘాట్, ప్రధాన ఘాట్ నుంచి వీఐపీ ఘాట్ వరకు రహదారి నిర్మాణం, మెయిన్ రోడ్డు నుంచి ఘాట్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం చేపట్టే పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్పీ బోనాల కిషన్, డీపీవో నారాయణ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.