హనుమకొండ, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. గురవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, జడ్పీ సీఈవో విద్యాలత, జిల్లా అధికారులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, లక్ష్మీ రమాకాంత్, చంద్రశేఖర్, రవీందర్ సింగ్, కలెక్టరేట్ పాలనాధికారి గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.