హనుమకొండ, జూన్ 10 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం స్ట్రాంగ్ రూంలను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి మంగళవారం తనిఖీ చేసారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా స్ట్రాంగ్ రూంలలో భద్రపరచిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈవీఎంల వివరాలు, రికార్డుల నిర్వహణ, బందోబస్తు గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్‌తో పాటు కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇవి శ్రీనివాసరావు, రజనీకాంత్, శ్యాంసుందర్, లక్ష్మణ్, ఎండి. నేహాల్, సయ్యద్ ఫైజుల్లా, తదితరులు పాల్గొన్నారు.