ఖిలావరంగల్, ఫిబ్రవరి 22: డిగ్రీ కళాశాలల అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. వరంగల్ కలెక్టరేట్లో డిగ్రీ కళాశాలల ‘డిస్ట్రిక్ట్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ రివ్యూ కమిటీ (డీసీఈడీఆర్) సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల డ్రాప్ ఔట్ శాతాన్ని తగ్గించాలని సూచించారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందేలా ప్రతి డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాలను నిరంతరంగా నిర్వహించాలన్నారు.
కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్, వరంగల్, వర్ధన్నపేట, సీకేఎం డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ జీ శ్రీనివాస్, డాక్టర్ జీ పోషయ్య, ఏ ధర్మారెడ్డి, డీఆర్డీవో కౌసల్యదేవి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ శ్రీనాథ్, డాక్టర్ బీ విష్ణుకుమార్, ఎం నరేందర్, పీ త్యాగయ్య, డాక్టర్ శివనాగశ్రీను, డాక్టర్ ఎం సోమయ్య, షహీన్ సుల్తానా, పీ వీరన్న పాల్గొన్నారు.