నర్సింహులపేట, నవంబర్ 5 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్, నర్సింహులపేట స్టేజీ పాఠశాలను గురువారం ఆకస్మికంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు సరైన వసతులు అందేలా స్థానిక అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా తోడ్పాటునివ్వాలని సూచించారు. దంతాలపల్లి కేజీవీబీ, మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ విద్యార్థులకు భోజనం తయారీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతు న్నాయని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రమేశ్ బాబు, ఎంపీడీవో యాకయ్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఉన్నారు.