బయ్యారం జూన్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం బయ్యారం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నామలపాడు పంచాయతీ పరిధిలోని ధర్మపురం, రాయకుంట గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు.
త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉందని వైద్య సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి, డాక్టర్ విజయ్ తదితరులు ఉన్నారు.