హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమవాది అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేద మైనారిటీలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని చీఫ్‌విప్ క్యాంపు కార్యాలయంలో సీం కేసీఆర్ చిత్రపటానికి మైనార్టీలు పాలాభిషేకం చేశారు. మైనార్టీలకు రుణాలు ఇచ్చేందుకు తొలుత రూ.50 కోట్లు మంజూరు చేశారు. అయితే మైనార్టీల్లో పేదలు ఎకువ సంఖ్యలో ఉన్నందున నిధులు సరిపోవని వరంగల్ జిల్లా మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్భాసర్ను కలిసి విన్నవించగా ఈ విషయాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రూ.50 నుంచి రూ.120 కోట్లకు నిధులను పెంచింది. దీంతో మైనారిటీలు హర్షం వ్యక్తం చేస్తూ చీఫ్ విప్ వినయభాసర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందిస్తున్నారని, వారికి మైనార్టీలు అండగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ వినయభాస్కర్ మాట్లాడుతూ సర్వమతాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తయారు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందన్నారు. సమైక్య పాలనలో మైనార్టీలను చిన్నచూపు చూసిన నాటి పాలకులు నిధులు కేటాయించలేదన్నారు. 120 కోట్లతో త్వరలోనే మైనారిటీలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రుణాలు అందిస్తామని వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నయీమొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ కుద్దుస్, మహ్మద్ ఖలీల్, నజీర్, మహమూద్, ఎండీ ఫిరోజ్, పర్వీన్, తస్లిమ్ తదితరులు పాల్గొన్నారు.
ఏసుక్రీస్తు ప్రేమ విశ్వమానవాళికి అవసరం
న్యూశాయంపేట : సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రే మ విశ్వమానవాళికి అవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ దా స్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చీఫ్ విప్ కుటుంబ సభ్యులు చర్చిలో కొవ్వత్తులు వెలిగించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించాలని కోరారు. గ్రేటర్ 61, 62, 49 డివిజన్లలో కార్యకర్తల నివాసాల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్వరి టెంపుల్ కమిటీ సభ్యులు చీఫ్ విప్ దంపతులను క్యాంపు కార్యాలయంలో కలిసి క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఇదిలా ఉండగా 31వ డివిజన్ హంటర్‌రోడ్డులోని కల్వరి ప్రార్ధన మందిరంలో, న్యూశాయంపేట జంక్షన్‌లోని హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ పాల్గొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
4వ డివిజన్లో..
హనుమకొండ సిటీ : నగరంలోని 4వ డివిజన్ పెద్దమ్మగడ్డ పాలెంలోని బెత్లెహేము బాప్టిస్ట్ చర్చి లో క్రీస్మస్ వేడుకలో చీప్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్,కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి ప్రత్యేక ప్రార్ధలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌కుమార్, సంఘకాపరులు సురేశ్‌కుమార్, సంఘ పెద్దలు పాల్గొన్నారు.