సంగెం, జనవరి 11 : గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గవిచర్ల, తీగరాజుపల్లి, నర్సానగర్ గ్రామాల్లో రూ.80 లక్షలతో నూతన జీపీ భవనాల పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. గాంధీనగర్ గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతివనం, బస్టాండ్, గాంధీజీ విగ్రహం, స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే పది కాలాల పాటు సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాలన్నారు.
బీజేపీ నాయకులు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఏఏ పథకాలు అమలు చేస్తున్నారో గ్రామాలకు వస్తే నిలదీయాలన్నారు. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతామన్న మోదీ ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లయ్య, సర్పంచ్‌లు దొనికల రమ-శ్రీనివాస్, మంగ్యానాయక్, ఛత్రునాయక్, ఏకాంబరం వెంకటేశ్వర్రావు, చైర్మన్ కుమారస్వామి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు బాబు, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, ఏవో యాకయ్య, నాయకులు ఉండీల రాజు, ఏఎంసీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, ఎంపీటీసీలు గుగులోత్ వీరమ్మ, రంగరాజు నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగుపై అవగాహన సదస్సు..
సంగెం : అంధత్వ నివారణ కోసం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని సాకారం చేద్దామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో కంటి వెలుగుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అంధత్వ రహితంగా మార్చడానికి రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. జీపీ కార్యాలయాలు, రేషన్ షాపుల వద్ద కంటి వెలుగు శిబిరాల వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. శిబిరాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి వాహనాలను సమకూర్చాలన్నారు. ప్రభుత్వం సామూహిక కంటి పరీక్షల కోసం రూ.250 కోట్లు వెచ్చిస్తున్నదని, కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి పొగాకుల అశోక్, ఎంపీడీవో కొమురయ్య, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు బాబు, సాగర్‌రెడ్డి, ఎంపీటీసీలు మల్లయ్య పాల్గొన్నారు.