కమలాపూర్, జూలై 24 : వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తున్నట్లు జీవో జారీ చేయడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, కౌశిక్‌రెడ్డి చిత్రపటాలకు వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.
వేలేరులో..
వేలేరు : మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నార్లగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆనంతరం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏలు ప్రవీణ్, కవిత, కృష్ణ, కనుకమ్మ, దేవిక పాల్గొన్నారు.
ధర్మసాగర్లో..
ధర్మసాగర్ : ధర్మసాగర్ మండల వీఆర్ఏలు సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం మండల అధ్యక్షుడు గుండు రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మేములకొండ కుమారస్వామి, గౌరవ అధ్యక్షుడు కందుకూరి భిక్షపతి, జంగా రాములు, కోశాధికారి పెసరు శ్రీనివాస్, కార్యదర్శి కొలిపాక రాజ్‌కుమార్, ముఖ్య సలహాదారులు సిక శంకర్, గుండు రమేశ్, సభ్యులు సంగారపు జంపయ్య పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్‌లో..
నర్సంపేటరూరల్/ఖానాపురం / చెన్నారావుపేట : వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పే స్కేల్ అమలు చేసినందుకు నర్సంపేట డివిజన్లోని వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు సోమవారం పాలాభిషేకం చేశారు. నర్సంపటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వీఆర్ఏలు గణేశ్, అనిల్, ఉల్లేరావు భిక్షపతి, శోభ, రమ, లక్ష్మీ, హైమ, సురేశ్, రమేశ్, సంజీవ, సంతోష్ పాల్గొన్నారు. ఖానాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా బాధ్యుడు బైరబోయిన ఐలేశ్, వీఆర్ఏలు మాధవి, భిక్షపతి, యాకయ్య, శ్రీను, సందీప్ పాల్గొన్నారు. చెన్నారావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జేఏసీ మండల చైర్మన్ శీలం రాజు, రాష్ట్ర అధ్యక్షుడు రాజులపాటి అశోక్, జిల్లా ప్రచార కార్యదర్శి ప్రభాకర్, వీఆర్ఏలు శివకోటి, రాజశేఖర్, రమేశ్ పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఏలు పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం : మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద వీఆర్ఏలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏలు జీజుల సత్యదేవ్, నరేందర్, ఆకుల ప్రవీణ్, శ్రీదేవి, టీ రజిత, బోగి లింగం, లక్క సుధాకర్, యాకయ్య, వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట : మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వీఆర్ఏలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా బాధ్యులు పూజారి సురేశ్, సాంబరాజు, నర్సయ్య పాల్గొన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వీఆర్ఏలు అంబేద్కర్ సెంటర్లోనే కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.