కాసిపేట : సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ( Sevalal Maharaj Jayanthi ) మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడీతండా(డీ) గ్రామ పంచాయతీలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బానోత్ సహస్ర తిరుపతి ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. అనంతరం ఉపవాసంతో భక్తిశ్రద్ధలతో సేవాలాల్ జయంతిని చేపట్టారు.
యువత సేవలాల్ బాటలో నడవాలని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా భక్తి మార్గాల వైపు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజ్మీర రమేష్, వార్డ్ సభ్యులు భూక్య రమేష్, బిలావత్ విజయ, సేవలాల్ పూజారి బిలావత్ భూమ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాదవ్ గజానంద్, మాజీ సర్పంచ్ భూక్య రవి, గ్రామ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.