జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా వెలసిన పటాకుల దుకాణాలను మున్సిపల్ అధికారులు మంగళవారం మూసివేశారు. మంగళవారం ‘ఒక్కరు పోయి.. ఇద్దరయ్యా రు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఈ మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్ సిబ్బందితో కలిసి పటాకుల దుకాణాలను తనిఖీ చేశారు.
అనుమతి పత్రాలు చూపించాలని కోరగా దరఖాస్తు చేసుకున్నామని, ఇంకా రాలేదని వ్యాపారులు చెప్పడంతో సుమారు 26 షాపులను మూసివేయించా రు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న టెంట్లను సైతం తొలగించారు. అనుమతి తీసుకున్నాకే తెరవాలని, లేనిపక్షంలో షాపు ల్లో ట్యాంకర్‌తో నీళ్లు చల్లిస్తామని హెచ్చరించారు. అక్కడ ట్యాంకర్‌ను, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కాగా, డబ్బులు వసూలు చేసి అనుమతులు ఇప్పించడంలో జాప్యం చేసిన ఆ ఇద్దరిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.