రాజీవ్ యువ వికాసం (ఆర్‌వైవీ) దరఖాస్తుదారులకు సిబి ల్ గుబులు పట్టుకుంది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు క్రెడిట్ స్కోర్‌తో లింక్ పెట్టడంతో గందరగోళం నెలకొంది. అసలు రుణం వస్తుం దా? లేదా? అనే అనుమానం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. గ్రేటర్ పరిధిలో 33,098 మంది వివిధ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సిబిల్ చెక్ చేసేందుకు వెంటనే ఆధార్ కార్డు సమర్పించాలంటూ ఆర్పీలు ఫోన్లో ఆదేశిస్తున్నారు.
దీంతో అయోమయానికి గురవుతున్న లబ్ధిదారులు మెప్మా ఆఫీసుకు పరుగెత్తుతున్నారు. సిబిల్ కోసం ఇప్పటి వరకు 12 వేల దరఖాస్తులు బ్యాంకులకు చేరగా, మరో 21 వేలు పంపాల్సి ఉంది. సిబిల్ స్కోర్ వివరా లు బ్యాంకర్లు ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులు ఎంపిక జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 10 రోజులు పట్టనుండగా, చాలా మందికి ఈ పథకం అందకుండా పోయే పరిస్థితి కనిపిస్తున్నది.
– వరంగల్, మే 13
రాజీవ్ యువ వికాసం (ఆర్‌వైవీ)తో చిరు వ్యాపారాలు చేసుకొని జీవితంలో స్థిరపడాలనుకున్న అనేక మంది నిరుద్యోగులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మంది జీరో అకౌంట్ తీసుకోవడంతో పెద్దగా లావాదేవీలు జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌వైవీ పథకానికి సిబిల్ స్కోర్‌తో లింక్ పెట్టడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది.
తమ ఖాతా నుంచి ఆర్థిక లావాదేవీలు జరగకపోవడంతో సిబిల్ ఎలా ఉంటుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది ఈ పథకం కోసమే కొత్తగా బ్యాంక్ ఖాతాలు తీసుకున్నారు. ప్రభుత్వ ప్రస్తుత చర్యలతో ఈ పథకంపై ఆశలు వదులుకోవాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 శాతం మంది సిబిల్ లేక ఈ పథకానికి అనర్హులవుతారని ఒక అధికారి తెలిపారు.
బ్యాంకులకు దరఖాస్తులు
సిబిల్ చెక్ చేసేందుకు గ్రేటర్ పరిధిలో 12 వేల దరఖాస్తులను అధికారులు బ్యాంకులను పంపించారు. ఇది బ్యాంకర్లకు తలనొప్పిగా మారడంతో పాటు ఖాతాదారుడికి రూ. 250 వరకు చార్జీ పడుతున్నది. చాలా మంది ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో బ్యాంకర్లు చెక్ చేయకుండా వదిలేస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇంకా 21,098 దరఖాస్తులు బ్యాంకర్లకు పంపించాల్సి ఉంది. అయితే దరఖాస్తుదారులు వెంటనే ఆధార్ కార్డులు అరగంటలో సమర్పించాలని గ్రేటర్‌లోని ఆర్పీలు ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు.
ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకుం డా ఇంటి వద్ద ఉన్నాం ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ ఆర్డర్లు వేస్తున్నట్లు పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఉర్సు సీఆర్సీ సెంటర్‌కు ఆధార్ కార్డులతో వచ్చిన పలువురు దరఖాస్తుదారులు ఆర్పీల కోసం గంటల తరబడి పడిగాపులు పడ్డారు. అయితే మండలాల పరిధిలో సుమారు 500 మందిని ఎంపిక చేసే అవకాశం ఉండగా, గ్రేటర్లో మాత్రం స్పష్టత కరువైంది.
పలువురు బ్యాంక్ లింకేజీ లేకుండా రూ. 50 వేల లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా మిగిలిన వారు రూ. 4 లక్షల వరకు కావాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే లబ్ధిదారులను ఏ పద్ధతిలో ఎంపిక చేస్తారనే దానిపై అధికారులు సమాధానం చెప్పడం లేదు. సిబిల్ స్కోర్ జాబితా వచ్చాకే గ్రేటర్ పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు.
నిబంధన ఎత్తివేయాలి
హనుమకొండ చౌరస్తా : రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీల్లో 6000 మంది కి నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రు ణాలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం తీరా దరఖాస్తు చేసుకున్నాక సిబిల్ సోర్కు లింక్ పెట్టడం సరైంది కాదు. సిబిల్ సోర్ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి.
– చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు