హనుమకొండ, జూన్ 27 : జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వేంటనే చెల్లించాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ర్ట ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్‌కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడుతూ జిల్లాలో 9 ప్రైవేట్ పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద 600 మంది పైగా విద్యార్ఠులు చదువుకుంటున్నారని, వీరికి గత మూడు సంవత్సరాలు కలిపి మొత్తం రూ. 3,34,80,000లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
వీటిని చెల్లించక పోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా యాజమాన్యాలు పిల్లలను పాఠశాలలో చేర్చుకోకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ర్ట మహిళా నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల అనిత, జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, నాయకులు మాదాసి అబ్రహం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.