మహదేవపూర్, జూన్ 24: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ పార్కులో సీఎస్ఆర్ నిధులతో పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి.
పార్కులో ముఖ్యంగా జారుడు బండ, రంగుల రట్నం తో పాటు పలు రకాల క్రీడా పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం,సాయంత్రం వేళల్లో చిన్నారులకు ఆటలు ఆడు కునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.