హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకతీయ వారసత్వ ప్రాంతాలను, తెలంగా ణ ప్రాంతంలోని ప్రాచీన దేవాలయాలు, కొండలపై, గుట్టలపై ఉన్న ప్రాచీన కళాఖండాలను కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో తీసుకొని అభివృద్ధి చేయాలని రాష్ట్రీయ హిందూపరిషత్ ఆధ్వర్యంలో దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చీకటి రాజు డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొండలపై, గుట్టలపై వెలిసిన దేవాలయాలు కోకొల్లలుగా ఉన్నాయని కానీ కొండలను, గుట్టలను అక్రమ మైనింగ్ ద్వారా ధ్వంసం చేస్తూ చరిత్రను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ పర్మిషన్ ఇవ్వకుండా జీవో విడుదల చేసి పలు ఆలయాలను పురావస్తుశాఖ పరిధిలోకి వచ్చేవిధంగా పాటుపడాలని కోరారు.