చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతనంగా ఎన్నుకున్న నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చెయాలని కోరారు.
నూతన కార్యవర్గంలో మండల పార్టీ అధ్యక్షులుగా బాల్నే వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అనుముల కుమారస్వామి, కొండవీటి ప్రదీప్ కుమార్, అమ్మ రాజేష్, మండల అధికార ప్రతినిధి కంది కృష్ణ చైతన్య రెడ్డి, ప్రధాన కార్యదర్శులు భూక్య రవీందర్ నాయక్, మాదారపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుసుమ నరేందర్, చెరుకుపల్లి విజేందర్ రెడ్డి, బానోతు గణేష్, నమిండ్ల సురేష, కార్యదర్శి సాదు నర్సింగరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎన్నిక కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.