పరకాల, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంటికొకరు తరలి రావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మలిదశ ఉద్యమకారుడు చందుపట్ల సాయి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సహకారమైందని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జిల్లాలోని ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తామన్నారు. పట్టణం నుంచి సుమారు ఐదు వేల మంది తరలించెందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్, నాయకులు హాజీ మియా, గణేష్, రోష్ణ, ఉమ, రమ తదితరులు పాల్గొన్నారు.