నల్లబెల్లి. జూన్ 08 : నర్ర భద్రన్న ఆశయాలను కొనసాగిస్తామని సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రన్న అన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ కమ్యూనిస్టు, సిపిఐ(ఎం.ఎల్) ప్రజాపంథా మేడపల్లి ఏరియా సీనియర్ నాయకులు కామ్రేడ్ నర్ర భద్రయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న అనారోగ్యంతో మరణించిన నర్ర భద్రయ్య భౌతిక కాయంపై ఎర్రగుడ్డ కప్పి నివాళులర్పించడం జరిగింది. అనంతరం జరిగిన సంతాప సభలో చంద్రన్న మాట్లాడుతూ మేడేపల్లి ప్రాంతంలో కనీసం సొంత ఇల్లు లేకుండా పీడిత ప్రజల విముక్తి కోసం విప్లవోద్యమంలో తుదిశ్వాస వరకు భద్రన్న నిలిచాడని గుర్తు చేశారు.
కమ్యూనిస్టు ఉద్యమాల్లో నీతి నిజాయితీ నిస్వార్థంగా శివసేశాడు అని తెలిపారు . ఆయన అకాల మరణం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రందా పార్టీకి, ప్రజా విప్లవోద్యమాలకు తీరని లోటని తెలిపారు. కమ్యూనిస్టు, విప్లవోద్యమంలో చివరి వరకు నిలబడి పేదల కోసం పోరాటం చేయడం ఆయన నైజం అన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, వరంగల్ జిల్లా కార్యదర్శి చిర్ర సూరి, నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు, వరంగల్ డివిజన్ కార్యదర్శి బొట్ల రాకేష్, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు అలువాల నరేష్, అఖిలభారత ఐక్య రైతు సంఘం నర్సంపేట డివిజన్ కార్యదర్శి గట్టి కొప్పుల రవి, ఉపాధ్యక్షులు ధార లింగన్న, అభి, రవి,సింగన బోయిన కట్టన్న, సాంబన్న, వెంకన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.