పరకాల, జనవరి 9 : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే గ్రామాల రూపురేఖలు మారాయని, రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్తోనే మార్పు సాధ్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామంలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్, హౌజ్‌బుజుర్గు, నీరుకుళ్ల, పెంచికలపేట గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం పాలన చేశారని, దీంతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నిలిచాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయని, అంతేకాకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందని కుటుంబం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. విపక్షాల కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్
ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండి సాంబయ్య బీఆర్ఎస్లో చేరారు.
అంధత్వ నివారణకు కృషి చేద్దాం అంధత్వ నివారణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో రాష్ట్రంలో అంధత్వాన్ని నివారిద్దామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంపై పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాల ప్రజాప్రతినిధులు, పలు విభాగాల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మానవ జీవితంలో కను చూపు అనేది చాలా కీలకమని, కంటి చూపు లేకపోతే జీవితమంతా అంధకారమని పేర్కొన్నారు. కంటికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, పేదరికంతో ఎంతో మంది చూపును కోల్పోతున్నారని అన్నారు.
అలాంటి ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ఈ నెల 18నుంచి రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను అందించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు శిబిరాల్లో ఆశ కార్యకర్తలు కీలకమని, వారు ప్రతి ఒక్కరికి సమాచారాన్ని అందించాలన్నారు. పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాల్లో 8 బృందాలతో 75 శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు.
బీఆర్ఎస్తోనే దేశంలో గుణాత్మక మార్పు
ఆత్మకూరు : దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మల్కపేట, హౌసుబుజుర్గు గ్రామాల్లో రూ.40లక్షలతో చేపట్టినగ్రామ పంచాయతీల భవనాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే ఆకాంక్ష ప్రతిఒక్కరిలోనూ ఉందని అన్నారు. ఎంపీపీ మార్క సుమలతారజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, సర్పంచ్‌లు మాడిశెట్టి వేణుగోపాల్, రబియాబీహుస్సేన్, రెడ్‌క్రాస్ డైరెక్టర్ దుంపలపల్లి బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, డీఈ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ రవీందర్, సర్పంచ్‌లు,ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.