టేకుమట్ల, జూలై 16 : టేకుమట్ల-రాఘవరెడ్డిపేట మధ్య చలివాగు వంతెన గత జూలైలో వరదకు కూలి పోయింది. దీంతో తాతాలిక మట్టి రోడ్డు వేయగా సోమ వారం కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో వాగు అవతలి గ్రామాల ప్రజలు ప్రమాదమని తెలిసినా వంతెన గడ్డర్లపై అడుగులో అడుగు వేస్తూ వాగు దాటుతున్నారు. వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేసి రవాణా సౌకర్యం క ల్పించాలని వారు కోరుతున్నారు.