హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2 : గ్రామీణ జిల్లాల్లో క్రికెట్ ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన హనుమకొండ, వరంగల్, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల అండర్ 16 జిల్లా జట్లను ఎంపిక ఈనెల వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూడీసీఏ) క్రికెట్ క్రీడా మైదానంలో ఈనెల 4న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన 6 జిల్లా జట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ఈనెలలో ఇంట్ర డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొనవాల్సి ఉంటుందన్నారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనపర్చిన ఉత్తమ క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జట్టుకు ఎంపిక చేయబడు తుం దన్నారు. ఎంపికైన ఉమ్మడి జిల్లా జట్టు హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే అంతర్ జిల్లా అండర్-16 పోటీల్లో పాల్గొనన్నట్లు, 2009 సెప్టెంబర్ 1 నుంచి 2011 ఆగస్టు 31 తేదీల మధ్య జన్మించిన ఆసక్తిగల ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు మీసేవ జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, సొంత క్రికెట్ కిట్లతో హాజరుకావాలని శ్రీనివాస్ తెలిపారు.