Siricilla | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 20 : తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామ బీఆర్ఎస్ నాయకులు దేవుని రమేష్‌ను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పరామర్శించారు. ఇటీవలే రమేష్ కూతురు లాస్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ మేరకు శనివారం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. లాస్య మృతి పట్ల, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వారికి రూ. 5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జంగిటీ అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేతలు పడిగెల రాజు, బల్లేపు సిద్దన్న, బీఆర్ఎస్ నాయకులు బండి దేవేందర్, బల్లెపు శ్రీనివాస్, ప్రశాంత్, చంటి, దేవయ్య, చిన్న నర్సయ్య గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.