ఖిలావరంగల్, జూలై 29 : మొహర్రం అంటనే అంటే త్యాగాల చరిత్ర.. రాచరిక వ్యవస్థ నిర్మూలనకు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హసన్, హుస్సేన్ మహనీయు లు చేసిన కృషి అంతా ఇంతా కాదు.. ము స్లింలకే కాదు.. ముస్లిమేతరులకు కూడా ఆ మహానీయుల త్యాగాలు మనసును తట్టిలేపుతాయి. హిందూ, ముస్లింల ఐక్యతకు.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొ హర్రం పర్వదిన వేడుకులను జిల్లా వ్యాప్తం గా ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పీరీలకు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం శనివారం రాత్రి దగ్గరలో ఉన్న చెరువులు, బావులల్లో నిమజ్జనం చేశారు. ఇదే క్రమంలో చారిత్రక నేపధ్యం కలిగిన ఓరుగల్లు కోటలో జరిగిన మొహ ర్రం వేడుకలకు నగర వాసులు భారీగా తరలివచ్చారు. మధ్యకోట సదర్‌చౌక్, బక్షిమహాల్లోని పీరీల కొట్టాలలో 9 రోజులు పాటు పీరీలకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రా ర్థనలు చేశారు. తమ శక్తానుసారం భక్తులు షర్బత్ (మట్కీలు), తీపి ముద్దలను, ఇతర తినుబండారాలను ఫాతియా (నైవేద్యం) ఇచ్చి మొక్కులు చెల్లించుకొన్నారు. పదో రోజు సాయంత్రం నమాజ్ తర్వాత సదర్‌చౌక్ నుంచి హుస్సేనీఅలం, హస్సేనీఅలం, పంజతన్, భారీఇమామ్ పీరీలతో పాటు మరో నాలుగు పీరీలను పడమర కోట మీదుగా ఖమ్మం రోడ్డులోని కాకతీయుల చారిత్రక బావి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దులా..దులా..హుస్సేన్ దూలా అంటూ భక్తులు భక్తి పారవశ్యం చెందారు. భక్తులు దట్టీలు కట్టి మొక్కలు చెల్లించుకొన్నారు. ఇస్లాం మతంలో ఓ నెల పేరును మోహర్రంగా పేర్కొంటారు. మొహర్రం సందర్భంగా ముస్లిములతోపాటు హిందువులు సైతం భక్తిశ్రద్ధలతో పీర్లను పూజించడంతో ఈ పండుగ హిందూ ముస్లిముల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.
ఐక్యతకు చిహ్నం ..
హిందూ, ముస్లిం సాంసృ్కతిక ఐక్యతకు చిహ్నం మొహర్రం పండుగ అని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం మధ్యకోటలోని పీరీల పండుగకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రూ.10 లక్షలు నిధులతో అశృఖానా, లైబ్ర రీ, జెండా గద్దెల నిర్మాణాకి శంకుస్థాపన చేశా రు. మైనార్టీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభు త్వం ఎంతగానో కృషి చేస్తుందన్నా రు. ఎమ్మెల్యే వెంటన 37, 38 డివిజన్ల కా ర్పొరేటర్లు వీ సువర్ణ, బీ ఉమ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు సురేశ్, మాజీ కార్పొరేటర్ దామోదర్‌యాదవ్, మత పెద్దలు, ప లు డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు ఉన్నారు.
త్యాగానికి ప్రతీక మొహర్రం : మేయర్
త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ అని మహానగర పాలకసంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం ఖిలావరంగల్‌లో నిర్వహించిన మొహర్రం వేడుకల్లో మేయర్ పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆమె వెంట ఎండీ కరీం, ఎస్డీ అకీల్, ఎండీ సాజిద్‌అలీ షా,ఎండీ ఖాజాపాషా, ముకబీర్, ఎండీ రాహెల్, జమీర్, సమీర్, సిద్ధిఖీ, షకీర్, పర్వేజ్,అల్తాఫ్, హఫీజ్, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట/ కరీమాబాద్: మొహర్రం పం డుగ ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆయన వరంగల్‌లోని చార్బౌళీ, నిజాంపురలో మొహ ర్రం పీరీల పండుగకు హాజరై ప్రార్థనలు చేశారు. అలాగే కరీమాబాద్‌లో నిర్వ హించిన వేడుక ల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ బాలిన సురేశ్, డివిజన్ అధ్యక్షులు, మైనార్టీ నాయకు లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.