నర్మెట, జూన్ 9 : ఇనుపరాడ్డుతో ఇరువురిపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. నర్మెట ఎస్ఐ నైనాల నాగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్మెటకు చెందిన వంగపల్లి రాజు, బండి శ్రీనివాస్ బైక్పై తరిగొప్పుల మండలం పోతారం గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇదే దారిలో అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన గాలి రవి కుమారుడు మట్టిలోడుతో ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్నాడు.
వెనుకాల వెళ్తున్న ద్విచక్రవాహనంపై మట్టి పడటంతోపాటు సైడ్ ఇవ్వకపోవడంతో ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసి డ్రైవర్ను ప్రశ్నించారు. దీంతో గాలి రవితో పాటు ఆయన కుమారుడు బైక్పై వెళ్తున్న వంగపల్లి రాజు, బండి శ్రీనివాస్ పై ఇనుప రాళ్లతో ఇద్దరు దాడి చేశారు. దీంతో రాజు పక్కటెముకలు, శ్రీను తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే స్థానికులు హాస్పిటల్కు తరలించారు. వంగపల్లి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.