జనగామ రూరల్, నవంబర్ 4 : బ్రిడ్జి కోసం ఆందోళన చేసిన చీటకోడూర్, చౌడారం గ్రామస్తు లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ మండలంలోని చీటకోడూర్, గానుగుపహాడ్, చౌడారం గ్రామాలతో పాటు సు మారు 20 గ్రామాలకు రాకపోకలు సాగే బ్రిడ్జి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో సోమవారం బ్రిడ్జిని నిర్మించాలని కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు గాడిదపై మంత్రి ఫొటో పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆర్అండ్బీ అధికారి రామగిరి స్వరూప ఫిర్యాదుతో పోలీసులు నిరసన వ్యక్తం చేసిన చౌడారానికి చెందిన యాసారపు కరుణాకర్, కర్ల ఎలేంద ర్ రెడ్డి, చీటకోడూరువాసులు బాల్నే ఉమాపతి, రా గుల రఘు, మారబోయిన రాజులపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి స్టేషన్‌కు తరలించారు.
దీంతో చీటకోడూర్, గానుగుపహాడ్, చౌ డారం తదితర గ్రామస్తులు జనగామ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి బ్రిడ్జి నిర్మించాలని ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయ డం ఏంటని ప్రశ్నించారు. అక్క డ కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మించక ప్రజల ప్రాణాలు పోతుంటే అధికారులు పట్టించుకోకపోగా తమపైనే కేసులు పెట్టడం ఏంటని వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదు ఇవ్వండి కేసు నమోదు చేసుకుంటామని పోలీసులు తెలపగా వెంటనే చౌడారానికి చెందిన సలేంద్ర కొమురయ్య ఆర్అండ్బీ అధికారి అశోక్ కుమార్‌పై ఫిర్యాదు చేశాడు. ఐదుగురిపై కేసు నమో దు కావడంతో జనగామ కోర్టుకు తరలించారు.
అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నాం : ఎమ్మెల్యే పల్లా
జనగామ చౌరస్తా : గ్రామస్తులను అర్ధరాత్రి పట్టుకొని అక్రమంగా అ రెస్ట్ చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నాం. గ్రామస్తులను వెంట నే విడుదల చేయాలి. కాం గ్రెస్ ప్రభుత్వానికి నిజం గా చిత్తశుద్ధి ఉంటే గానుగుపహాడ్, చీటకోడూ రు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ప్రస్తు తం అక్కడ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ఆ మార్గం లో ప్రయాణికులు, ప్రజలు ప్రమాదాల బారినపడి తీవ్రంగా గాయపడుతున్నారు. బ్రిడ్జి పను లు చేపట్టాల్సిన అధికారులు అది విస్మరించి ప్ర భుత్వ పెద్దల ప్రోత్సాహంతో అమాయక దళిత, బహుజన సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురిపై కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. కాంగ్రెస్ హయాంలో నిరసన తెలిపే హ క్కు ప్రజలకు లేకుండా పోయింది. ఈ ని యం త పాలనకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు.