ఖిలా వరంగల్ : శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకొని అధిక దిగుబడిని సాధించాలని గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ రైతులకు సూచించారు. తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో రైతుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పేరుతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, రైతులతో సదస్సులు నిర్వాహిస్తోందని చెప్పారు.
కాలానికి అనుగుణంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకొని రైతులు మంచి దిగుబడి సాధించాలని సూచించారు. ఆధునాతన పద్ధతిలో పంటలు పండించి రైతులు సంపన్నులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం శాస్త్రవేత్త డాక్టర్ సంజన, రిటైర్ వ్యవసాయ అధికారి సారంగపాణి, ఏఈఓ చంద్రకాంత్.. రైతులకు ఏయే పంటలు వేయాలో, ఎందులో ఎక్కువ దిగుబడి వస్తుందో, నేలల స్వభావం బట్టి ఎలాంటి పంటలు వేసి మంచి ఆదాయం సాధించాలో వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు తోటకూరి నర్సయ్య, బోలుగొడ్డు శ్రీనివాస్, చింతం రమేష్, వనపర్తి కరుణాకర్, శిరబోయిన ఎల్లయ్య, బిల్లా కిషోర్, కొమురయ్య, బేర నరేందర్, చింతం వినయ్, ఆరసం రాంబాబు, ఏసీరెడ్డి రమేష్, కుమార్, దేవేందర్, రాజు, ఐలయ్య, సారంగపాణి, శిరబోయిన శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.