వాజేడు, ఆగస్టు16: భారీ వర్షాలు కురుస్తుండడంతో ములు గు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలోని బొగత జలపాతం కనువిందు చేస్తున్నది. పాలసంద్రంలా మారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. శనివారం ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి బొగత జలపాతాన్ని సందర్శించారు.
బొగత జలపాత సందర్శనను ఆదివారం నుంచి నిలిపివేస్తుట్లు ఎఫ్ఆర్వో చంద్రమౌళి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.