రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని గన్పార్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు. ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాసర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.