బచ్చన్నపేట నవంబర్ 12 : రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ అన్నారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈనెల 26న జాతీయ రాజ్యాంగ రక్షణకై ఛలో ఢిల్లీ కార్యక్రమ వాల్ పోస్టర్‌ను బుధవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన భవన్ వద్ద నగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల బాల్ నరసయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతకైనా పోరాటం చేయాలని, రాజ్యాంగ హక్కులను సాధించడానికే జాతీయ మాలమహానాడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. జాతీయస్థాయిలో మాల, మహర్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకమని, తక్షణమే పునః సమీక్షించాలన్నారు. దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. రెన్సీ నోట్లపై భారతరత్న అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలన్నారు. ఛలో ఢిల్లీని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలిని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నరసయ్య, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరా వెంకటేష్, డా. వెంకన్న బాబు, బచ్చన్నపేట మండల అధ్యక్షులు తమ్మడి మహేందర్, సానాది క్రాంతి, మద్దూరి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.